సంబంధిత వార్తలు
- రైతులకు తీపికబురు..రూ.లక్ష క్యాష్‌ప్రైజ్.. రిజిస్ట్రేషన్ ఇలా..?
- లోన్ యాప్‌ల వ్యవహారం... కొడుకుని పోలీసులకు పట్టించిన తండ్రి!
- మెడికల్ క్రౌడ్ ఫండింగ్‌లో నాయకత్వస్థానంలో ఉన్న విజయవాడ: 14వేల మంది దాతల నుంచి రూ. 2.5 కోట్ల సేకరణ
- థాయ్ రాజును ముప్పతిప్పలు పెడుతున్న భార్య - ప్రియురాలి వైరం!
- కొత్త క్రెడిట్ కార్డు పొందాలనుకుంటున్నారా? రూ.250 చెల్లిస్తే చాలు
ఇంటివద్దనే బస్‌పాస్‌లు.. బస్టాండ్ల వద్దకు రావాల్సిన అవసరం లేదు..
TSRTC
ప్రస్తుతం కోవిడ్ నేపథ్యం, విద్యాలయాలు మూతబడడం, ఇంటి నుంచే చాలామంది ఉద్యోగాలు చేస్తుండడంతో బస్‌పాస్‌లు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతున్నది. గ్రేటర్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో మొన్నటివరకు 50శాతం ఉండగా, క్రమంగా పుంజుకుంటుంది.
బస్‌పాస్ రెన్యువల్‌కు ప్రతినెలా బస్టాండ్‌లోని కౌంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రద్దీ ఉంటే నిరీక్షణ తప్పదు. కొత్తపాస్ తీసుకోవాలనుకున్నా ప్రత్యేకంగా కౌంటర్ వద్దకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాజాగా టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్ వినియోగదారుల కోసం కొత్త అవకాశాన్ని కల్పించింది.
కొత్తగా బస్‌పాస్ తీసుకునేందుకు, పాత్ పాస్‌ల రెన్యువల్ కోసం బస్టాండ్ల వద్దకు రాకుండా వినియోదారుల వద్దకే వెళ్లి రెన్యువల్ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్తగా బస్‌పాస్ తీసుకునేవారు, రెన్యువల్ చేసుకునే వారు ఒకే ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నేరుగా వారి వద్దకే సిబ్బంది వచ్చి పాస్‌లు జారీ చేస్తారు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే 8008204216 నంబర్‌ను సంప్రదించాలి.