సంబంధిత వార్తలు
- చిరంజీవి విడుదలచేసిన `మందులోడా మాస్ కా బాస్` సాంగ్ కు స్పందన
- శ్రీదేవి సోడా సెంటర్ లో మందులోడా మాయలోడా.. ఫోక్‌సాంగ్ వచ్చేసింది
- క్రిష్ ఆవిష్కరించిన `పీనట్ డైమండ్` ట్రైలర్
- బుర్రిపాలెంలో కోవిడ్ వేక్సిన్; నిరాడంబరంగా కృష్ణ జన్మదినవేడుకలు
- `శ్రీదేవి సోడా సెంటర్`లో సిక్స్పేక్తో సుధీర్‌బాబు (video)
సోడాల శ్రీదేవిగా ఆనంది (video)
Sodala annadi
అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్..ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్టయ్యింది. విడుదలయ్యిన మెదటి లుక్ కి, ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ కి, తాజాగా విడుదల చేసిన మందులోడా పాటకి విపరీతమైన క్రేజ్ రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీదేవిసోడాసెంటర్ లో సుదీర్ బాబుకి జోడిగా తెలుగమ్మాయి ఆనంది నటిస్తుందనే విషయాన్ని ప్రకటిస్తూనే ఆనంది ఈ సినిమాలో పోషించిన సోడాల శ్రీదేవి పాత్రకి సంబంధించిన వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఆనంది మరో వైవిధ్యమైన పాత్రతో శ్రీదేవిసోడా సెంటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుందనే విషయం ఈ వీడియో గ్లిమ్స్ తెలియజేస్తోంది.
ఆనంది అభినయం, కరుణకుమార్ డైరెక్షన్ స్కిల్స్, పంచ్ డైలాగ్స్, 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ వెరసి సోడాల శ్రీదేవి క్యారెక్టర్ వీడియో గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రాన్ని భలేమంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి బ్లాక్‌బస్టర్ హ్యట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 పలాస చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది.
