సంబంధిత వార్తలు
వేడి వేడి ఇడ్లీలు కావాలా? ఐతే ఇడ్లీ ఏటీఎం వచ్చేసిందిగా! చట్నీతో పాటు..?
Idly
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఏర్పాటైన ఇడ్లీ ఏటీఎం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రత్యేకమైన యంత్రం వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. బి పద్మనాభన్ అనే వ్యక్తి షేర్ చేసిన వీడియోలో ఇడ్లీ ఏటీఎం ఎలా పని చేస్తుందో ఓ మహిళ వివరిస్తుంది.
ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ ఏటీఎం ఔట్ లెట్‌ను చూపించడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో ఆర్డర్ ఎలా చేయాలో వివరిస్తుంది.
కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుందని, ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో పార్సిల్ బయటికి వస్తుందని ఆమె చెప్పింది. రుచి కూడా బాగుందని సదరు మహిళ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Idli ATM in Bangalore... pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban ([email protected]) (@padhucfp) October 13, 2022
