బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (18:27 IST)

ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?

ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ఐశ్వర్యనాశనము, సంతానారిష్టము కలుగగలవు. 
 
ఉత్తరదిశ తగినంత పల్లము కలిగియున్న అట్టి గృహమందు నివసించువారికి సర్వజనపూజ్యత, పుత్రపౌత్రాభివృద్ధి, యశము, ధనధాన్యసంపదలు సర్వత్ర శుభములు కలుగగలవు. మెరకకలిగిన ఉత్తరమందు పాకలు మొదలగు కట్టడము కలిగి యుండుట వలన క్రమక్రమముగా ధననష్టము, వంశనాశనము కలుగును.
 
ఉత్తర దిశయందు నూతులు, గోతులు, వర్షపు నీరు పోవు కాల్వలు మొదలగునవి యున్నట్లైతే ధనలాభము, సంతతికి అభివృద్ధి కలుగగలదు. ఉత్తర దిశలో మరుగుదొడ్లు కట్టినట్లైతే రోగాలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు.