బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 3 జులై 2014 (13:06 IST)

ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలట!

మీ ఇంటి ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో ఉంటే వెంటనే మార్పు చేయాల్సిందేనని వాస్తు నిపుణులు అంటున్నారు. కిటికీలు బేసి సంఖ్యలో ఉంటే ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉండవని, ఇంకా సున్నతో చేరిన సరి సంఖ్యలు (10, 20, 30) పనికిరావని వారు హెచ్చరిస్తున్నారు.
 
ఇంటి స్థలంలో దక్షిణ- పశ్చిమ- నైరుతి దిశలు మెరకగాను, ఉత్తర - తూర్పు - ఈశాన్య దిశలు పల్లంగాను ఉండాలి. బయట నీరు ఇంటి ఆవరణలోకి రాకూడదు. ఇంటిలోని నీరు తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశల నుంచి బయటికి పోవడం శ్రేయస్కరం. 
 
తూర్పు- ఉత్తర దిశలలో ప్రహరీ గోడను కలుపుకొని గదులను నిర్మించకూడదు. ఖాళీలు ఉండాలి. తూర్పు-పడమరలో గానీ, ఉత్తర- దక్షిణాలలో గానీ రెండు వరండాలు నిర్మించవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.