శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (19:19 IST)

బ్రెస్ట్ ఫీడింగ్‌ను రెండేళ్ల తర్వాత మాన్పిస్తే...

బ్రెస్ట్ ఫీడింగ్‌ను సరైన ఏజ్‌లో మాన్పిస్తే... బ్రెస్ట్ తిరిగి ఫిట్‌గా ఉంటాయని గైనకాలజిస్టులు అంటున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్‌ను సరైన ఏజ్‌లో మాన్పించడం బ్రెస్ట్స్‌ను సాగిపోవడం నుంచి రక్షించుకోవడానికి బేబీని ఆకస్మికంగా బ్రెస్ట్ ఫీడింగ్‌ను దూరం చేయకండి. బేబీని గమనిస్తూ మెల్ల మెల్లగా బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు నుంచి తప్పించండి.
 
ఏడెనిమిది నెలలకి పిల్లలు సెమీ సాలిడ్ ఫుడ్స్‌కి అలవాటు చేయండి. అప్పుడు తల్లిపాలు తాగే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అలా మెల్ల మెల్లగా చిన్నారికి తల్లిపాల అలవాటును మాన్పించవచ్చు. అయినప్పటికీ WHO గైడ్ లైన్స్ ప్రకారం పాపాయికి రెండేళ్ళ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ మీ బ్రెస్ట్స్ షేప్‌ని కాపాడుకోవాలి అనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. 
 
ఒక్కసారి చంటిబిడ్డ సరైన ఆహార పద్దతులకు అలవాటు పడగానే బ్రెస్ట్ ఫీడింగ్‌ను రోజుకు ఒక్కసారికే పరిమితం చేయవచ్చు. అలా మెల్ల మెల్లగా బ్రెస్ట్ ఫీడింగ్‌ను తగ్గించవచ్చు. పాపాయి రెండేళ్ళ వయసుకు వచ్చే సరికి బ్రెస్ట్ ఫీడింగ్‌ను మానిపించేయవచ్చు. 
 
ప్రసవం తరువాత చాలా మంది మహిళలు చేసే కామన్ మిస్టేక్ సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. లావైపోతారేమోనన్న భయంతో శరీరానికి అవసరమయ్యే సాచురేటెడ్ ఫ్యాట్స్‌ను తీసుకునే మోతాదును బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తగ్గించేస్తారు. దీని వల్ల స్కిన్ డ్యామేజ్ కలుగుతుంది. వక్షోజాల చుట్టూ ఉన్న చర్మం షేప్ పాడయిపోతుంది. 
 
ఎలాస్టిసిటీ తగ్గిపోయి సాగిపోతుంది. ప్రసవమైనప్పటి నుంచి బిడ్డకు పాలివ్వడం వల్ల కలిగే స్ట్రెచ్ మార్క్స్‌ని నిర్మూలించే శక్తి కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్‌కి ఉంది. కాబట్టి నర్సింగ్ టైంలో సరైన పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. ఆహారంలో తప్పని సరిగా ఎగ్స్, మీట్ డైరీ ప్రోడక్ట్స్ తగినంత ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. స్కిన్ ఎలాస్టిసిటీని పరిరక్షించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు.