గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (16:10 IST)

వింటర్ బ్యూటీ టిప్స్: కోల్డ్ క్రీమ్ ప్యాక్!

వింటర్ వచ్చేస్తోంది. ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటిలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రపరచుకుని, బ్రాండెడ్ కోల్డ్ క్రీమ్ లేడా మాయిశ్చైజర్‌ను రాసుకోండి. చలికాలంలో క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
రాత్రి పడుకునే ముందు కోల్డ్ క్రీమ్‌ని తప్పనిసరిగా రాసుకోవాలి. చలికాలంలో దాదాపు చర్మంలో నూనె ఉత్పత్తి శాతం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే చర్మం పొడిబారిపోవడం, ముడతలు పడటం కనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారు వారానికోసారి ఎక్స్ ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. 
 
ఈ చర్య వల్ల చర్మంలో పేర్కొన్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. చలికాలంలో ప్రతిరోజు స్నానానికి ముందు కొబ్బరినూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.