1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. అడ్రస్ డైరీ

పూరీ జగన్నాథ్ చిరునామా మీ కోసం...

వినోదం వెండితెర అడ్రస్ డైరీ బద్రి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం పోకిరి టిపికల్ లవ్స్టోరీ జగన్నాథ్ దర్శకత్వం
WD
బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఆంధ్రావాలా, శివమణి, పోకిరి, బుజ్జిగాడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌ సినీ రంగంలో డైరక్టర్‌గా ఓ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆదిత్యారామ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్యారామ్ నిర్మాణ సారథ్యం వహించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రం గురించి పూరీ చెబుతూ... టిపికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్రేమకథా నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమా ఇంతవరకు ప్రేక్షకుల ముందుకు రాలేదని అన్నారు. యాక్షన్, కామెడీ, లవ్‌ వంటి అంశాలతో కూడిన ఈ సినిమా కథ చెప్పగానే ఆదిత్యారామ్ స్పందించి సినిమా తీయడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. ఈ సినిమాకు "నేనేలేకపోతే" అనే టైటిల్‌‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. తన తమ్ముడు సాయిరాంశంకర్‌ను హీరోగా సక్సెస్‌ చేయాలని పట్టుదలతో పూరీ ఉన్నారు.

ఇప్పటికే పూరీ సోదరుడు సాయిరాం శంకర్, సుహాని జంటగా వీరు క్రియేషన్స్ అండ్ శ్రీసద్గురు సినిమా పతాకంపై "వాడే కావాలి" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాజేంద్ర దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతుతున్న ఈ సినిమాకు కాసాని వీరేష్ బాబు, రఘునాధ్ సోగి సంయుక్త నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. తాజాగా రవితేజ, శియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "నేనింతే" సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూరీ చిరునామా మీ కోసం...

పూరీ జగన్నాథ్ (డైరక్టర్, ప్రొడ్యూసర్),
ప్లాట్ నెంబర్, 591, రోడ్డు నెం. 31,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్-33.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT