ఈ రోజు ఎనిమిది జూన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో గొప్పదనం ఏంటంటే... ఈ రోజు ప్రముఖ బాలీవుడ్ నటి, పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఆమెకు మనమందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తాం. రానున్న పుట్టిన రోజుకు ఆమె వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
దీనిపై ఆమె ప్రతిస్పందిస్తూ...ఈ సంవత్సరం చివరిలో ఆమె రాజ్‌తో మూడు ముళ్ళు వేయించుకోనున్నట్లు తెలిపింది.
ఈ పుట్టిన రోజుతో ఆమె 34 సంవత్సరాలకు చేరుకుంటుంది. "బిగ్ బ్రదర్" షోతో ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. అక్షయ్ కుమార్‌ను వదిలేసిన తర్వాత ఆమె రాజ్ కుంద్రాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది.
ఈ ఆనందమే ఆమెను ఐపీఎల్‌లోని ఓ టీమ్‌లో భాగస్వామిగా మారింది. ప్రత్యేకించి ఆమెకోసం లండన్, ముంబైలలో పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నట్లు సమాచారం.
సినిమాలద్వారా ఆమె తన పేరు ప్రఖ్యాతలను పెంచుకోవాలనుకుంది, కాని ఆ పేరు ప్రతిష్టలు ఒక్క టీవీషోద్వారా వచ్చేసాయని సినీవర్గాలు అంటుంటారు. కాగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినాకూడా ఎప్పడూ ఆమె ప్రజల నోట్లో నానుతుంటుంది.
పుట్టిన తేదీ.. 8 జూన్, 1975, జన్మస్థలం.. మంగళూరు, నటించిన చిత్రాలు.. దోస్తానా, అప్నే, లైఫ్ ఇన్ ఎ మెట్రో, సాహస వీరుడు సాగర కన్య తదితరాలు. నటించిన మొత్తం చిత్రాలు.. దాదాపు 50కి పైగా.