ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించిన "జయం" సినిమా ద్వారా "వెళ్లవయ్యా.. వెళ్లూ.." అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాలనటి సదా.
"జయం"లో లంగావోణిల్లో తెలుగమ్మాయిలా కనిపించిన సదా.. తర్వాత విలక్షణ నటుడు విక్రమ్‌తో "అపరిచితుడు"లో నటించింది. చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా తదితర సినిమాల్లో నటించిన సదా తాజాగా శ్రీకాంత్ సరస న "అ..ఆ..ఇ..ఈ.." చిత్రంలో అందాలను ఆరబోస్తోంది.
ఈ సినిమా షూటింగ్ మధ్యలో సదా కదిలిస్తే.. "నటిని కాకపోతే.. ఇంజనీర్‌ని అయ్యేదానినని" చెప్పింది. అలాగే ఎక్స్‌పోజింగ్ గురించి చెబుతూ.. హద్దులు దాటనంతవరకు పర్వాలేదని.. అందంగా కనిపించాలేగానీ.. అసభ్యంగా ఉండకూడదని తెలిపింది. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని సహించలేనని, "బతుకు బతకనివ్వు" అనే మాట తనకు నచ్చుతుందని సదా వెల్లడించింది.
తెలుపు, పీచ్ రంగులంటే ఎంతో ఇష్టమంటోన్న సదా పూర్తి పేరు: సదాఫ్ మొహమ్మద్ సయీద్. ముద్దుపేరు: డార్లి, పుట్టిన తేది: ఫిబ్రవరి 17, జన్మస్థలం: పూణె, తొలి చిత్రం: జయం, నచ్చిన కారు: టయోటా, ఫేవరేట్ హాలిడే స్పాట్: ఇల్లు. ఫేవరేట్ పెర్‌ఫ్యూమ్: గ్లోబర్ ఎల్లో, అలవాట్లు: పుస్తకాలను చదవడం, నచ్చిన హీరోయిన్: మాధురీ దీక్షిత్, నచ్చిన హీరోలు: షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నచ్చిన సంగీత దర్శకుడు: ఎ.ఆర్. రెహ్మాన్, హరీశ్ జయరాజ్.