1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరుత చిత్రం విడుదలలో జాప్యం?

ఆంధ్రుల ఆభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు
ఆంధ్రుల అభిమాన నటుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా చేస్తున్న "చిరుత" సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు మెండుగా వున్నాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాను చిరంజీవి తొలి సినిమా "పునాది రాళ్ళు" విడుదలైన రోజైన సెప్టెంబర్ 22న విడుదల చేయాలని చిరంజీవి అలోచిస్తున్నారు. ఈ వాయిదా నిర్ణయం వెనుక మరో కథ కూడా వినిపిస్తుంది.

ఈ సెంటిమెంట్ కంటే.. వ్యాపారాంశం కూడా అధికంగా ఉందని సినీ విమర్శకులు నిక్కచ్చిగా చెబుతున్నారు. చిరంజీవి తాజా చిత్రం "శంకర్‌దాదా జిందాబాద్" జులై మొదటి వారంలో గానీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తండ్రీ కొడుకుల సినిమాల మధ్య కనీసం 50 రోజుల వ్యవధి ఉండాలన్న ఉద్దేశంతోనే "చిరుత" సినిమాను నెలరోజుల పాటు వాయిదా వేసేందుకు నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు రాజధాని ఫిల్మ్ వర్గాల సమాచారం.
About Writer
WD