కృష్ణవంశీ చిత్రంలో హీరోయిన్‌గా సింధుతులానీ
నటి సింధు తులానీని మళ్ళీ చూసే భాగ్యం దర్శకుడు కృష్ణవంశీ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కల్పించనున్నారు. ఆయన తాజా చిత్రం 'చందమామ' సినిమాలో సింధు తులానీ నటిస్తోంది. తులానీతో పాటు కాజల్ మరో హీరోయిన్‌గా ఈ సినిమాలో దర్శనమివ్వబోతోంది. సింధు తులానీ, కాజల్‌కు ముందే 'చందమామ' సినిమాలో హీరోయిన్లుగా ఎంపికయినవారు మధుశాలినీ, అంద్రియాతలు. అంతేకాదు నవదీప్, శివబాలాజీ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాలో కొన్ని సీన్లలో కూడా వీరిద్దరు నటించారు.
అయితే.. మధుశాలిని, అంద్రియాత నటనకు విసిగిపోయిన కృష్ణవంశీ ఇక చాలు అనుకొని నిర్మొహమాటంలేకుండా వారిద్దరినీ తొలగించి వారి స్థానంలో సింధుకు కాజల్‌లను తీసుకున్నారు. అవకాశాలు వచ్చినపుడు ఆనందంగానూ, అవకాశాలు లేనపుడు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లే సింధు ఎలాగైతేనేమి అభిమానులకు కనిపించబోతోంది.