1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆఫర్ల వెల్లువలో జోనీలియా

బొమ్మరిల్లు
బొమ్మరిల్లు, తాజాగా ఢీ సినిమాలు విజయవంతం అవడంతో జెనీలీయా నెమ్మదిగా బిజీ అవుతోంది. ఇప్పటికే కె.విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై విష్ణువర్ధన్ హీరోగా మోహన్ బాబు నిర్మించనున్న రోమియో జూలియట్ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఆనంద్ ఫేమ్ రాజా హీరోగా నిర్మితం కానున్న మిస్టర్ మేధావి సినిమాలో కూడా హీరోయిన్ జెనీలియానే. శ్రీను వైట్ల దర్శక్తత్వంలో రామ్ హీరోగా తలపెట్టిన మరో చిత్రంలో కూడా జెనీలియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. వీటితో పాటు.. మరో రెండు కన్నడ సినిమాలలో కూడా నటించనుంది.
About Writer
WD