నిర్మాతగా మారనున్న నటి రాశి
తన అందచందాలతో, మత్తెక్కించే చూపులతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైన హీరోయిన రాశి త్వరలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది. నివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని చిత్రపరిశ్రమకు దూరమైన రాశి.. త్వరలో సినీ నిర్మాతగా మారనుంది.
శ్రీ కృష్ణ ప్రొడక్షన్‌పై డి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాశి సమర్పకులుగా వ్యవహరించనుంది. ముఖ్యమైన విషయమేమిటంటే.. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరో, అను మెహతా, సింగర్ పూనమ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాశి తన భర్త నివాస్‌ను తొలిసారి దర్శకునిగా పరిచయం చేయనుంది.
అలాగే.. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు శ్రీ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నాయి. ఇంకా.. సునీల్, ఆలీ, బ్రహ్మానందం, షఫీలు కూడా నటిస్తున్న ఈ చిత్రానికి జస్వంత్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.