1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఎన్టీఆర్ జీవితాన్ని ప్రతిబింభించే ''ఒక్కమగాడు''

యువరత్న బాలకృష్ణ హీరోగా
యువరత్న బాలకృష్ణ హీరోగా, వైవీఎస్.చౌదవి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఒక్కమగాడు' చిత్ర కథ స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్రను ప్రతిబింభించే విధంగా ఉంటుందని రాజధాని వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెల్సిందే.

అనుష్క, నిషా కొఠారి, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. గ్రామీణ వాతావారణంతో కూడిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం కోనసీమకు చిత్రం యూనిట్ వెళ్ళనుంది.

ఇదిలావుండగా చిత్రం కథా సారంశాన్ని మాత్రం నిర్మాత, దర్శకుడు బయటకు పొక్కనీయడం లేదు. అయితే ఎన్టీఆర్ జీవితాంశాలకు అతిదగ్గరగా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా.. ఓ గ్రామంలో ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన రైతుబిడ్డ, పట్టణానికి వచ్చి, అక్కడి ప్రజలతో కలిసిపోయి, రాజకీయాల్లో చేరి, తర్వాత ప్రముఖ వ్యక్తిగా ఎలా మారాడన్నదే ఈ చిత్రం కథాంశంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
About Writer
WD