1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''శివాజీ'' తదుపరి చిత్రానికి ముద్దుల కుమార్తె దర్శకత్వం?

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో 'ది బాస్' (శివాజీ)గా నీరాజనాలు అందుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే తదుపరి చిత్రం
దక్షిణ భారత చలనచిత్ర రంగంలో 'ది బాస్' (శివాజీ)గా నీరాజనాలు అందుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే తదుపరి చిత్రంపై అపుడే ఊహాగానాలు ఆరంభమయ్యాయి. ఈ చిత్రానికి తన ముద్దుల కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం.

ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రశ్నించగా ఆమె నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. మా నాన్న చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే ఏ చిత్ర దర్శుకునికైనా ఉండే డ్రీమ్. డాడీకి ఉన్న వీరాభిమానుల్లో నేనూ ఒకదాన్ని. మిగిలిన దర్శకులులాగానే.. ఆయన చిత్రానికి దర్శకత్వం వహించాలని అందరిలాగే నేనూ భావిస్తాను అని తెలివిగా సమాధానం చెప్పింది.

అయితే.. సౌందర్య చిత్ర రంగానికి కొత్తేమి కాదు. ఇప్పటికే ఆమె తల్లి లతారజనీకాంత్ నెలకొల్పిన ఓషెర్ స్టూడియో పర్యవేక్షణను సౌందర్యే చూస్తోంది. తమిళనాడు వెండితెర చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన చంద్రముఖి, తాజాగా శివాజీ (ది బాస్) చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్‌కు అత్యాధునిక హంగులు కల్పిచండంలో ఓషెర్ స్టూడియోతో పాటు.. సౌందర్య అత్యంత కీలకపాత్ర పోషించారు. అయితే.. రజనీకి ఉన్న ఇమేన్‌ను దృష్టిలో ఉంచుకుని కుమార్తె దర్శకత్వంలో నటిస్తారా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
About Writer
WD