డీటీఎస్ మిక్సింగ్‌లో ''లక్ష్యం''
గోపీచంద్, అనుష్య హీరోహీరోయిన్లుగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'లక్ష్యం'. శ్రీవాసు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం డీటీఎస్ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. నిర్మాత ఈ విషయాలను తెలియజేస్తూ... జూలైలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నాం. మా సంస్థలో రెండు చిత్రాలూ ఘనవిజయాన్ని సాధించాయి. ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే ఆదిత్య ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. మణిశర్మ చక్కటి బాణీలు సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్య హైలైట్‌గా నిలుస్తుంది... అన్నారు.
గోపీచంద్ వ్యాఖ్యానిస్తూ... డబ్బింగ్ చెబుతున్నప్పుడు చిత్రంపై మరింత నమ్మకం పెరిగింది. ఇది కుటుంబ కథే అనుకుంటే కుటుంబ కథ. మాస్‌ను మెప్పించే పలు అంశాలున్నాయి. నా పాత్రను చూస్తే.. నవ్వుతూ నవ్విస్తూ హాయిగా గడిపేసే కాలేజీ కుర్రాడిలా కనిపిస్తాయి. అయితే మనసులో ఓ లక్ష్యం ఉంటుంది. నిరంతరం దాని గురించిన ఆలోచనతో ముందుకెళ్తుంటాను. ఆ ప్రయాణమే ఆసక్తికరం. అసలు ఆ లక్ష్యం ఏర్పరచుకోవడానికి గల కారణం ఏమిటన్నది సస్పెన్స్. నా అన్నగారి పాత్రలో జగపతిబాబు నటించారు. నా లక్ష్యానికి తోడుగా అనుష్క సాయపడుతుంది... అన్నారు.