1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గుణ దర్శకత్వంలో నటించనున్న ''డాన్''

లోగడ 'ఐతే'
లోగడ 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు' సినిమాలను నిర్మించిన దర్శక నిర్మాత గుణ్ణం రాజు, అక్కినేని నాగార్జున హీరోగా ఓ చిత్రాన్ని తీసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాడు. జస్ట్ యెల్లో బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. రాజు నిర్మించిన తాజా చిత్రం 'అమ్మ చెప్పింది' సినిమా కథా పరంగా, ట్రీట్ మెంట్ పరంగా ప్రశంసలు పొందింది.

అంతకు ముందు రాజు దర్శకత్వం వహించిన 'లిటిల్ సోల్జర్స్' సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చింది. వెరైటీ చిత్రాలను నిర్మించడంలో సిద్ధహస్తుడైన రాజు, నాగ్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రమంటే సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది. బహుషా ఈ సినిమా నాగ్ 'డాన్' చిత్రం తరువాత మొదలవవచ్చు.
About Writer
WD