డాక్టర్ రాజశేఖర్ తదుపరి చిత్రం ''గోరింటాకు''
కొంతకాలం వరకు సరైన హిట్లు లేక సతమతమైన హీరో డాక్టర్ రాజశేఖర్‌కు ఇటీవల తన భార్య జీవిత నిర్మించిన 'ఎవడైతే నాకేంటి' చిత్రం మంచి లైఫ్ ఇచ్చింది. ఈ చిత్రంలో మాస్‌ను ఆకట్టుకున్న రాజశేఖర్, తన తదుపరి చిత్రంలో మహిళా లోకాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించనున్నారు. మంచి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో పేరుగాంచిన సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌లో రాజశేఖర్ నటించనున్నారు.
ఈ చిత్రానికి 'గోరింటాకు' అనే టైటిల్‌ను పెట్టేందుకు నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో రాజశేఖర్‌తో ఈ సంస్థ 'సింహరాశి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. 'గోరింటాకు' చిత్రానికి 'నువ్వు వస్తావని' చిత్రానికి దర్శకత్వం వహించిన వీఆర్.ప్రతాప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఛార్మీ హీరోయిన్‌గా ఎంపికకాగా, మీరాజాస్మిన్ హీరో చెల్లెలుగా నటించనుంది. గతంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 'గోరింటాకు' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.