హీరో పాత్రలో యువనిర్మాత ఆదిత్యబాబు
గతంలో 'జగడం' చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత త్వరలో వెండితెరపై హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి 'క్షత్రియుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, హ్యాపీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏ.కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాయి. అయితే.. కరుణాకరన్ దర్శకత్వం వహించిన 'తొలిప్రేమ' మినహా మిగిలి చిత్రాలు చెప్పుకోదగిన విజయాన్ని సొంతం చేసుకోలేదు.
ఈ నేపథ్యంలో నిర్మాత ఆదిత్య బాబు తన తన హీరో అదృష్టాన్ని కరుణాకరన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలను సమకూర్చనున్నారు. ఇదిలావుండగా.. ఇష్టం చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విక్రమ్‌తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ఆదిత్యబాబు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి చలాకీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.