1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పవన్‌కళ్యాణ్‌కు నోటీసు జారీ చేసిన విశాఖ కోర్టు

పవన్‌కళ్యాణ్‌కు కోర్టు నోటీసు
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు హీరో పవన్‌కళ్యాణ్‌పై తొలి భార్య నందిని విశాఖ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసును జారీ చేసింది. తనను తొలుత వివాహం చేసుకున్నారనీ, అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే... మరో యువతిని వివాహమాడారని నందిని తన ఫిర్యాదులో ప్రస్తావించారు. . అందువల్ల తనకు మనోవర్తి కింది నెలకు ఐదు లక్షల రూపాయలను నెలభృతిగా చెల్లించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం హీరో పవన్‌ కళ్యాణ్ నటి రేణుదేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకోగా.. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం హిందూ వివాహ చట్టం కింద చెల్లదని నందిని పేర్కొనడమే కాకుండా.. పవన్‌‌కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ వరకట్నం తేవాలని వేధించారని తన పిటీషన్‌లో పేర్కొంటూ.. హీరో చిరంజీవితో పాటు మొత్తం 14 మందిని తన పిటీషన్‌లో నిందితులుగా నందిని పేర్కొన్నారు.
About Writer
WD