సాయికుమార్ ప్రధాన పాత్రలో మరో చిత్రం
బుధవారం, 27 జూన్ 2007( 13:10 IST )
'సామాన్యుడు' చిత్రంలో విలక్షణమైన పాత్రను పోషించిన సాయికుమార్ తాజాగా మరో చిత్రంలో నటించనున్నారు. సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నటి రాశి సమర్పణలో ఆమె భర్త శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
జూలై 9న హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. రిషి, పూనమ్‌సింగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖైదాబ్రదర్స్ నిర్మించిన డిఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి కెమెర్ జస్వంత్, సంగీతం శ్రీలు సమర్పించారు.