1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శరవేగంగా కల్యాణ్‌రామ్ కొత్త చిత్రం షూటింగ్

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సముద్ర దర్శకత్వంలో సాయి సర్వజిత్‌ మూవీస్‌ పతాకంపై ఈదర రంగారావు
నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సముద్ర దర్శకత్వంలో సాయి సర్వజిత్‌ మూవీస్‌ పతాకంపై ఈదర రంగారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా ముందుకుసాగుతోంది. ఇప్పటికే మూడు పాటలతో సహా నలభై శాతం టాకీ పూర్తి చేసుకున్నఈ చిత్రం, ప్రస్తుతం స్టన్‌ శివ నేతృత్వంలో కళ్యాణ్‌రామ్‌ ఫైటర్స్‌ పాల్గొనగా నానక్‌రామ్‌గూడాలో కొన్ని ఫైట్స్ సన్నివేశాలను చిత్రీకర్తిసున్నారు.

దీనిపై చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. సినిమాలో ఇది రెండవ ఫైట్‌ అని, షూటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యే వరకూ ఈ షెడ్యూల్‌ను కొనసాగిస్తామని ఆయన అన్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘శివకాశి’ చిత్రానికి ఇది రీ-మేక్‌ అని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని సముద్ర ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాత ఈదర రంగారావు మాట్లాడుతూ, వచ్చే నెల ఐదో తేదీన మా హీరో కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తామన్నారు. సినిమా చాలా బాగా వస్తోంది. ఆగస్ట్ 23 లేదా సెప్టెంబర్‌ ఆరో తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు.