‘సీమాశాస్త్రి’ షూటింగ్ పూర్తి
అల్లరి నరేశ్, ఫర్జానా జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చావలి రామాంజనేయులు నిర్మిస్తున్న ‘సీమశాస్త్రి’ చిత్రం షూటింగ్ జూన్ 23వ తేదీతో పూర్తచేసుకుంది. ఫిల్మ్‌సిటీలోని ‘ఇంద్ర’ హౌస్‌సెట్‌లో నరేశ్, ఫర్జానా, ముప్ఫైమంది కమెడియన్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా పతాక సన్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా పూర్తయిందని, రాజు ఆధ్వర్యంలో క్లైమ్సాక్‌ను చిత్రీకరించామని న్మిరాత తెలిపారు.
29న ఆడియోను విడుదల చేయబోతున్నామని, జూలై రెండో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. సినిమా గురించి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, “కొత్త కాన్సెప్ట్‌తో తీసిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. ఐదు పాటలున్న ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ వినసొంపైన బాణీలను అందించారు.
అలానే మరుధూరి రాజా సంభాషణలు కడుపుబ్బ నవ్విస్తాయి. దర్శకునిగా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుంది” అని అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న విధంగా పూర్తి చేయగలిగామని సమర్పకులు వంశీ కృష్ణారెడ్డి తెలిపారు.