''అనసూయ’ చిత్రంలో బుల్లితెర రిపోర్టర్‌గా భూమిక
ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రవిబాబు నిర్మిస్తున్న ‘అనసూయ’ చిత్రంలో నటి భూమిక బుల్లితెర రిపోర్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల ఇరవై ఏడుతో పూర్తయిందని రవిబాబు తెలిపారు. ఈ షెడ్యూల్‌లో భూమిక, బేబీ నేహలపై ఓ పాటను చిత్రీకరించామని, అలానే భూమిక, అబ్బాస్ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామన్నారు.
ఈ నెల 30 నుంచి జూలై 30వ తేదీ వరకు రెండో షెడ్యూల్ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకులు హరి అనుమోలు తనయుడు శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇటీవల విడుదలైన ‘జ్ఞాపకం’ చిత్రం ద్వారా శేఖర్ చంద్ర సంగీత దర్శకునిగా పరిచయమైన విషయం తెల్లిందే.