పలు ''లక్కీఛాన్స్''లు మిస్ అయ్యాను: సదా
'వెళ్ళవయ్యా.. వెళ్లూ' అంటూ 'జయం' సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన నటి సదా. 'ఆకులు కాలాక.. చేతులు పట్టుకున్న' చందంగా ఇపుడు గతంలో కోల్పోయిన అవకాశాలను ఇపుడు నెమరు వేసుకోంటోంది. పలువురు ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాన్ని చేజార్చుకున్నానని, అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నట్టు వాపోతోంది.
తాజాగా దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం రెండుసార్లు వచ్చిందని.. రెండు పర్యాయాలు మిస్ అయ్యాయని పేర్కొంటోంది. లోగడ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన 'అపరచితుడు' (తమిళంలో అన్నియన్) చిత్రం కారణంగా ఈ లక్కీఛాన్స్ మిస్ అయిందంటోంది.
ఇటీవల చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అపరిచితుడు సినిమాలో నటిస్తున్నప్పుడు రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కాల్షీట్స్ లేక ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చింది. ఆ పాత్రకు సిమ్రాన్ అనుకున్నప్పటికీ ఎందుకో ఆమెను తీసివేసి మళ్లీ తనను సంప్రదించారు.
కానీ అంగీకరించలేక పోయాను. అలాగే తెలుగులోను ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నాని అంటోంది ఈ జయం భామ. అయితే.. కెరీర్‌ను సుస్థిరం చేసుకునేంత వరకు పెళ్లి ఆలోచనను దరికి చేరనీయని, ప్రేమపై తనకేమాత్రం నమ్మకం లేదని చెపుతోంది సదా.