1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఉనికి కోసం.. హీరోయిన్ నగ్నంగా ఫోటో సెషన్..!

తెలుగు వెండితెరకు పరాయి రాష్ట్రాల భామల తాకిడి అధికమైంది. ఆరణాల తెలుగు ముద్దుగుమ్మలను కాదని నిర్మాతలు
తెలుగు వెండితెరకు పరాయి రాష్ట్రాల భామల తాకిడి అధికమైంది. ఆరణాల తెలుగు ముద్దుగుమ్మలను కాదని నిర్మాతలు, దర్శకులు బాలీవుడ్ భామల కోసం వెంపర్లాడుతున్నారు. అలా వచ్చే భామలు కూడా ఒకటి రెండు చిత్రాల తర్వాత కనుమరుగు కావడం సహజంగా మారింది. దీంతో.. తన ఉనికిని కాపాడుకునేందుకు కొంతమంది హీరోయిన్లు ఏదో ఒక ప్రత్యేకతో తమను పాపులర్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారు.

ఆ కోవలోనే శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'కాంచనమాల.. కేబుల్ టీవీ' చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు వెండి తెరకు పరిచయమైన లక్ష్మీరాయ్.. తాజాగా తమిళనాడులో ఓసాహసం చేసిందట. ఓ తమిళ చిత్రం కోసం.. నగ్నంగా ఫోటో షెషన్‌లో పాల్గొని సంచలనం సృష్టించింది. ఈ వార్తలు చెన్నై కోడంబాక్కం వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

దక్షిణ భారతంలో తన సినీ కెరీర్‌ను సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. తాజాగా 'జయం' రవితో తమిళంలో 'ధామ్ ధూమ్' సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది. మలయాళంలో మమ్ముట్టితో కలిసి నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీరాయ్ చేసిన సాహసం ఆమె కేరీర్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేసి చూడాల్సిందే.
About Writer
WD