1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సంచలనమైన బిపాసాబసు ''ముద్దు''

ఇటీవలికాలంలో భారతీయ నటీమణులు సంచలనాలకరమైన వార్తలకెక్కుతున్నారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు భారత్‌కు వచ్చిన హాలీవుడ్
ఇటీవలికాలంలో భారతీయ నటీమణులు సంచలనాలకరమైన వార్తలకెక్కుతున్నారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు భారత్‌కు వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె‌, బాలీవుడ్ గ్లామర్ నటి శిల్పాల బహిరంగ స్టేజీ ముద్దు చుంభనం పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెల్సిందే. ఇది సద్దుమణగక ముందే.. తాజాగా మరో బాలీవుడ్ నటి బిపాసాబసు ఇదే తరహా ముద్దుతో సంచలన వార్తల్లోకి ఎక్కారు.

ఇటీవల లిస్బాన్‌‌‌లో జరిగిన 'న్యూ సెవన్ వండర్స్' కార్యక్రానికి బిపాసా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో ఆహుతులను అమితంగా ఆకర్షించిన బిపాసా.. ఇదే కార్యక్రమంలో స్టేజీపైకి వచ్చిన రోనాల్డో బిపాసాను హత్తుకుని గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.

ఆ తర్వాత ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ఆరాధనా భావంతో చూసుకోవడం ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఈ ముద్దు సన్నివేశం మరుసటి రోజు లండన్ పత్రికల్లో ప్రధాన వార్తా కథనంగా ప్రచురించాయి. ఇదిలావుండగా బిపాసాబసు ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రాహాం కూడా మండిపడుతున్నాడు. ఈ తాజా సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి