1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''ముత్యాలముగ్గు'' హీరో శ్రీధర్ ఇకలేరు

'ముత్యాలముగ్గు' చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమై
'ముత్యాలముగ్గు' చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమై, అనతికాలంలోనే మంచి నటునుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీధర్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. దాదాపు 150 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. తొలుత హీరోగా పరిచయమైన శ్రీధర్ తర్వాత విలన్‌గా నటిస్తూ స్థిరపడ్డారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం ఆపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ పరిస్థితుల్లో బుధవారం గుండెపోటు వచ్చింది. డాక్టర్లు ఎన్నో రకాలుగా చికిత్సలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. కరుణామయుడు, యశోదకృష్ణ, సీతామహాలక్ష్మీ, అడవిరాముడు, జస్టీస్ చౌదరి, ఈనాడు, బొమ్మరిల్లు, బాలకృష్ణ నటించిన సీతారామ కళ్యాణం తదితర చిత్రాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. గొరంతదీపం, బొమ్మిరిల్లు వంటి సినిమాలు ఆయనకు మంచి బ్రేక్‌ను ఇచ్చాయి.

శ్రీధర్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు కె.నాగబాబు, ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జునరావులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, బత్తుల ప్రసాద్‌లు కూడా సంతాపం తెలిపారు. శ్రీధర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి