మహేషా మజాకా..!
తెలుగు సినిమా స్టామినా ఏమిటో తెలుసుకున్న పలు బాలీవుడ్ కార్పోరేట్ సంస్థలు తెలుగు చిత్ర నిర్మాణరంగంపై దృష్టిని సారించాయి. సెన్సేషనల్ హిట్ చిత్రం 'పోకిరి'తో ఒక్కసారిగా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన 'ప్రిన్స్' మహేష్‌బాబును యుటివి అక్కున చేర్చుకుంది.
మహేష్‌తో ఏకంగా మూడు చిత్రాలను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తాజా సమాచారం. ఇందుకోసం మొత్తం రూ.55 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేస్తోంది. హిందీలో 'రంగ్‌దే బసంతీ', 'లక్ష్య', 'కోస్లాకి గోడా', 'స్వదేశ్', 'ఢీ', 'ది నేమ్ సేక్', 'మెట్రో' వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ తెలుగులో నిర్మించడం గమనార్హం.
ప్రస్తుతం ఆ సంస్థ హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్‌తో 'జోదా అక్బర్' అనే చిత్రాన్ని, మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'ఫ్యాషన్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. యుటివి ఎనిమిది భాషల్లో బుల్లితెర ఛానళ్లను ప్రారంభించనుంది. అందులో ఒకటి తెలుగు ఛానల్ కూడా ఉంది.