1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''భక్త అనంతాచార్య''గా సుమన్

అన్నమయ్య'లో శ్రీవేంకటేశ్వరస్వామిగా
WD PhotoWD
'అన్నమయ్య'లో శ్రీవేంకటేశ్వరస్వామిగా, 'భక్తరామదాసు'లో భద్రాచల రామునిగా నటించిన సుమన్ ప్రస్తుతం 'భక్త అనంతచార్య'గా కనిపించనున్నారు. వెయ్యేళ్ళక్రితం తిరపతి క్షేత్రంలో ఎన్నో అడ్డంకులూ, అవరోధాలు అధికమించి అచంచలమైన భక్తి విశ్వాసాలతో పుష్పాలంకరణతో శ్రీవారికి నిత్య పూజలు చేసిన మహాభక్తుడు అనంతాచార్య. నాడు నరసంచారమే లేని తిరుమల కొండపై ఒక్కడే చెరువు తవ్వి శ్రీమద్రామానుజాచార్యుల వారితే 'మగధీరుడు' అనే బిరుదును పొందిన అనంతాచార్య జీవిత కథలోని ఎన్నో మలుపులు, నాస్తిక పరిపాలకు దౌర్జన్యాలు, వారు కల్పించిన కష్టాలు ఈ చిత్రకథలో ప్రధాన వృత్తంగాసాగనుంది.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుమన్ రంగనాథ్, గౌతమ్‌లపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్‌కు నారా రామ్మూర్తినాయుడు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత కె.రాజశేఖర్ మాట్లాడుతూ.. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై ఎఫ్.ఎం.సి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. అలనాటి సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించిన శశిప్రీతమ్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంగీత బాణీలను సమకూర్చుతున్నారన్నారు.

జాతీయ స్థాయి అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ మధు మహంకాళి కెమరా పనితనం ఈ చిత్రానికి ప్రత్యేక హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఈనెల 23వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, హైదరాబాద్, తిరుపతి, మదురై తదితర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరుపుకుంటామన్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈచిత్రానికి రచన శ్రీసద్గురు కె.శివానందమూర్తి, ఎడిటర్...కె.రవీంద్రబాబు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి