1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''యమదొంగ'' పాటలు విడుదల

గతంలో భారీ హిట్ చిత్రాలు తీసి ప్రేక్షకులను ఆలరించి
'యమా' అంటూ చిత్రగుప్తుడు (శ్రీనివాసరెడ్డి) ప్రత్యక్షమయ్యాడు.
నేను 'యమ'ని కాదు. 'సుమ'ని. ఇలా భూలోకం విచ్చేశారేంటి?
ఇద్దరి పాపాలు పెరిగి పోయాయి. యమలోకానికి తీసుకెళ్దామని వచ్చారు.
ఎవరా ఇద్దరు?
గతంలో భారీ హిట్ చిత్రాలు తీసి ప్రేక్షకులను ఆలరించి, నేడు సినిమాలు తీయకుండా రాజకీయాలంటూ వెళ్లిపోయిన దాసరి నారాయణ రావు ఒకరైతే.. పూలు, పళ్లను అందంగా తెరకెక్కించడం మానేసి 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' అంటూ ముసలాళ్ళను కన్నీటి పర్యంతం చేస్తున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మరొకరు.
సినిమాలకు దూరమైనా దాసరి ఆపద్భాందవుడిగా సినిమా పరిశ్రమను ఆదుకుంటున్నారు. అది కన్నీరు కాదు ఆనంద భాష్పాలని సుమ ఎంత చెప్పినా చిత్రగుప్తుడు వినలేదు.

దర్శకత్వానికి సింబల్ అయిన రెండు చేతులను సలసల కాగే నూనెలో పెట్టడమొక్కటే వీరి పాపాలకు పరిష్కారమని చిత్రగుప్తుడు ఆదేశించాడు. సుమ ఆక్షేపించగా..
వారు నిజంగా పాపాలుచేస్తే తోలు ఊడుతుంది. లేకుంటే.. పాపాలు చేయలేదని అర్థమన్నాడు.

అగ్రదర్శకులిద్దరూ సలసల కాగుతునన నూనె (అంతా పొగ)లో చేతులు పెట్టి యమదొంగ ఆడియో సీడీలను సంయుక్తంగా విడుదల చేశారు.

చలోక్తులు...చమక్కులు.. సున్నిత విమర్శలు.. హస్య ప్రసంగాలతో యమదొంగ ఆడియో విడుదల కార్యక్రమం రెండు గంటల పాటు ఆహుతులను ఆలరిస్తూ ఆహ్లాదకరంగాసాగింది. ఎన్‌.టి.ఆర్, దర్శకుడు రాజమౌళిల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. చెర్రీ, ఊర్మిళ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'యమదొంగ'లో ఊహించని పాయింట్ ఉంది.. దాసరి
ఎవరూ ఊహించని పాయింట్ యమదొంగ చిత్రంలో ఉంది. ఇంతవరకు తెలుగు తెరపై అలాంటి ప్రయోగం జరగలేదు. కృషి, దీక్ష, పట్టుదలను నమ్ముకున్నాడు కాబట్టే రాజమౌళి విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. కీరవాణి తెలుగు సంగీతానికి గౌవరం తెచ్చాడు. ఎన్.టి.ఆర్. రాఖీ చిత్రంలో 450 అడుగుల నిడివి ఉన్న సింగిల్ షాట్‌లో రకరకాల హావ భావాలను ఉత్తమంగా పలికించాడు. కసి ఉన్న ఆర్టిస్టు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి