1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

'మైసమ్మ'గా వస్తున్న 'పోకిరి' ఐటంగర్ల్

'పోకిరి' చిత్రంలో
'పోకిరి' చిత్రంలో "ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే.." అంటూ కుర్రకారును హుషారెత్తించిన ఐటంగర్ల్ ముమైత్ ఖాన్. ఇపుడిపుడే తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకొంటోంది. ఐటంగర్ల్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ముమైత్‌కు తర్వాత చిన్ని వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. ఇపుడు ఏకంగా "మైసమ్మ" అనే చిత్రంలో ఆమె ప్రధాన టైటిల్ రోల్‌ను పోషించనుంది. ఈ చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే‌ను అందిచనున్నారు.

ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై జి.జగదీష్ చంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాసరి శిష్యుడు భరత్ పారేపల్లి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. "మైసమ్మ" చిత్రం తొలి సన్నివేశాన్ని ముమైత్‌ ఖాన్‌పై చిత్రీకరించారు. ఈ చిత్రానికి కథను "ఒసేయ్ రాములమ్మా" తరహాలో దర్శకరత్న అందించారని, దీన్ని వందరోజుల చిత్రంగా తీసి గురువుగారి రుణాన్ని తీర్చుకుంటామని దర్శకుడు భరత్ ధీమా వ్యక్తం చేశాడు.

చిత్రంలోని ఇతర పాత్రల్లో ఈటీవీ ప్రభాకర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ధర్మవరపు, ఎంఎస్.నారాయణ, ఎల్బీ.శ్రీరామ్, రఘుబాబు, జీవా, దువ్వాసి తదితరులు నటిస్తుండగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతబాణీలను సమకూర్చుతున్నాడు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి