1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నితిన్ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభం

నితిన్
నితిన్, కాజల్ హీరోహీరోయిన్లుగా రేఖా కంబైన్స్ సమర్పణలో 'యజ్ఞం' ఫేం ఎఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సి.కళ్యాణ్, ఎస్.విజయానంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చగా, హైదరాబాద్‌లోని హాలీవుడ్ స్టూడియోలో పాటల రికార్డింగ్‌ ప్రారంభించారు.

దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడూతు..ప్రేమ, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న కుటుంబకథా చిత్రమన్నారు. ఆగస్టు 27వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. నాగబాబు, డా.శివప్రసాద్‌లను మాత్రమే ఇప్పటికి ఎంపి చేశామని, మిగిలిన తారాగణాన్ని త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు .. మరుధూరి రాజా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..ఎఎస్.రవికుమార్‌.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి