1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ''చిరు'' చిత్రం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మితమవుతున్న
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మితమవుతున్న "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వచ్చి 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' చిత్రాన్ని నిర్మించిన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్స్‌గా 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది.

అయితే.. ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి కాస్మిక్ ఫిల్మ్స్ సంస్థ హక్కులు సంపాదించింది. ఇందుకు సంబంధించి త్వరలో ప్రివ్యూ షోలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ హీరో రవితేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ ఉండనే ఉన్నాడు.

ఇక చిరంజీవి సరసన మోడల్ కరిష్మా కోఠక్ హీరోయిన్ పాత్రలో కనిపించనున్నది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లోనే ఆల్‌టైం బెస్ట్ అనే విధంగా బాణీలను అందించాడు.

ఈచిత్రంలోని 'ఆకలేస్తే అన్నం పెడతా...' అనే పాటకు బాలీవుడ్ ఐటమ్ గార్ల్ యానాగుప్తా వేసిన చిందులు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకొంటున్నారు. పికాక్ ఇండియన్ కెఫే సంస్థతో కలిసి విదేశీ హక్కులను పొందిన కాస్మిక్ ఫిల్మ్స్ సంస్థ 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాను భారత్‌లో తప్ప ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో విడుదల చేయనుంది.
About Writer
PNR