''మిత్రుడు'' తరుణ్ సరసన ప్రియమణి
తెలుగు వెండితెరకు పరిచయమైన అతి కొద్దిసమయంలోనే తారాపథానికి దూసుకుపోయిన నటీమణులలో ప్రియమణి ఒకరు. జగపతి బాబు హీరోగా నటించిన 'పెళ్ళైన కొత్తలో' అనే సినిమాతో తెలుగులో ప్రవేశించిన ప్రియమణి తొలి చిత్రంతోనే విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. తెలుగులో మాదిరిగానే తమిళంలోనూ దూసుకుపోతున్న ప్రియమణి అక్కడ మరిన్ని సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నది.
తన అందచందాలతో గ్లామర్ క్వీన్‌గా అందాలను చిందిస్తున్న ప్రియమణికి చక్కని భవిష్యత్ ఉందని త్వరలోనే త్రిష, నయనతారలను అధిగమించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. తెలుగులో ఇటీవల విడుదల అయిన 'టాస్' సినిమాలోను ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకుంది.
అలాగే. ఆగస్టులో విడుదల కానున్న 'యమదొంగ' సినిమా ఆమె కెరీర్ గ్రాఫ్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ఇదిలావుండగా తరుణ్ హీరోగా నిర్మితం కానున్న మిత్రుడు చిత్రంలోనూ ప్రియమణి హీరోయిన్‌గా ఎంపికైంది.