1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శిల్పాశెట్టికి యూకే వర్శిటీ డాక్టరేట్

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి యునైటెడ్ కింగ్‌డమ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేయనుంది. సాంస్కృతిక
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి యునైటెడ్ కింగ్‌డమ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేయనుంది. సాంస్కృతిక రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి గాను ఈ బిరుదును ప్రధానం చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలోని లీడ్స్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం 32 సంవత్సరాల బాలీవుడ్ తారకు డాక్టరేట్ ఇవ్వనున్నట్టు విశ్వవిద్యాలయ ప్రతినిధి వెల్లడించారు.

మంగుళూరులో జన్మించిన శిల్పాశెట్టి బాలీవుడ్‌లో తన అద్వితీయ నటన ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాందించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే డాక్టరేట్ పురస్కారాన్ని పొందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, షబానా ఆజ్మీ, యష్ చోప్రాల సరసన ఈ మంగుళూరు భామ చేరనుంది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి