జర్మనీకి వెళ్లిన ''తులసి'' యూనిట్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న "తులసి" చిత్రం యూనిట్ జర్మనీకి వెళ్ళింది. సినిమాలో అతి ముఖ్యమైన సన్నివేశాలతో పాటు.. బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు కోసం చిత్రం యూనిట్ జర్మనీకి వెళ్ళింది. ఇప్పటికే హీరో వెంకటేష్, హీరోయిన్ నయనతార, దర్శకుడు బోయపాటి శ్రీనులు అక్కడకు చేరుకున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. లోగడ వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత వెంకీ చిత్రం జర్మనీలో షూటింగ్ జరుపుకోవడం ఇదే. జయం మనదేరా చిత్రాన్ని కూడా సురేష్ బాబు నిర్మించడం విశేషం.