1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పరమేష్, సింధు తులానీ జంటగా కొత్త చిత్రం

పరమేష్
పరమేష్, సింధు తులానీ జంటగా శ్రీరామ్ దర్శకత్వంలో కలవకూరి అంకబాబు, సోమరాజు పురుషోత్తమరావు సంయుక్తంగా నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ఐతే' చిత్రంలో మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సింధు తులానీకి తాజా చిత్రం మంచి బ్రేక్ ఇస్తోందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్రం ప్రశంసనీయంగా ఉందన్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ను గతనెల 28వ తేదీన ప్రారంభించి ఏకధాటిగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 30 శాతం పూర్తయిన ఈ చిత్రం కథ.. ప్రేమ, కుటుంబ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నరేష్, నాగబాబు హీరో హీరోయిన్ల తల్లిదండ్రులుగా నటిస్తున్నారని చెప్పారు.

తొలిసారిగా నటిస్తోన్న ప్రేమ కథా చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని హీరో పరమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, లక్ష్మీపతి, ముమైత్ ఖాన్, రమాప్రభ, రవళి తదితరులు నటిస్తుండగా.. మాటలు.. రామస్వామి, సంగీతం.. ఆర్పీ.పట్నాయక్, కెమరా.. వాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. పి.మధుసూధన్ రెడ్డి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి