పాటల రికార్డింగ్‌తో రాజీవ్ కనకాల చిత్రం ప్రారంభం
|
అలాగే పలువురి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డు ప్లేయర్‌గా పనిచేసిన విజయవర్షిణి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరచమవుతున్నారు. ఈ చిత్ర విశేషాలపై దర్శకుడు రాజ్‌నాగ్ మాట్లాడుతూ.. సమాజంలో బర్నింగ్ పాయింటైన తీవ్రవాద నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో యువత బాధ్యత ఎంతైనా ఉందని చెప్పే పాయింట్‌ను కొత్త కోణంలో తెరపై చూపించనున్నట్టు తెలిపారు.
ఆగస్టు పదో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం నటీనటులను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాటలు.. చంద్రబోస్, కెమెరా.. కళ్యాణ్, రచన.. మోహన్, కె.శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. రాజ్‌నాగ్.పి.