1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రీ రికార్డింగ్‌లో బాలాదిత్య-గాయత్రిల ''సంధ్య''

బాలాదిత్య
WD PhotoWD
బాలాదిత్య, గాయత్రి జంటగా త్రిమూర్తి సెల్యులాయిడ్ పతాకంపై గణమురళి దర్శకత్వంలో నిర్మాత బైరయ్యగుప్తా నిర్మిస్తున్న "సంధ్య" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రీ రికార్డింగ్ జరుపుకోటోంది. సూపర్ గుడ్ థియేటర్‌లో రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామని సహ నిర్మాత సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఈ చిత్రం కథపై దర్శకుడు గణమురళి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని హీరోయిన్‌కు చదువంటే పంచప్రాణాలని, ఎలాగైనా కష్టపడి చదివి డాక్టర్ కావాలన్నదే ఆమె ఆశయం. అయితే.. ఇంట్లో తండ్రి ప్రోత్సాహం లేకపోవడంతో ఏమి చేయాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఆమెకు ఓ యువకుడు పరిచయమవుతాడు. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే ఆ యువకుడు.. చదువుకోవాలనే తపన పడే యువతిని చూశాక కొంత మార్పు కనిపిస్తుంది. ఆమె ఆయన సాధన కోసం పాటుపడతాడు.

ఈ రెండు పాత్రలను హీరోహీరోయిన్‌లైన బాలాదిత్య, గాయత్రిలు పోషించారని చెప్పారు. అనంతరం నిర్మాత బైరయ్య మాట్లాడుతూ.. చక్కని సందేశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. సంధ్య చిత్రానికి మాటలు.. సాగర్, సంగీతం.. గణేశ్ చక్రవర్తి, కెమెరా.. రామ్ కుమార్, సమర్పణ.. గద్దె మురళి, కథ, స్క్రీన్ ప్లే, డిజైనింగ్, దర్శకత్వం.. గణమురళి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి