అనిల్ కపూర్ కన్నీటి పర్యంతం...
వినడానికి ఆశ్చర్యంగా... వింతగా ఉందా| కానీ ఇది నిజం. అనిల్ కపూర్ నిర్మించిన 'గాంధీ మై ఫాదర్' చిత్రం ప్రెస్‌మీట్ ఆ మథ్య లండన్‌లో జరిగింది. దర్శకుడు ఫిరోజ్ ఖాన్, కథానాయకుడు అక్షయ్ ఖన్నా తదితర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే మాట్లాడమని అనిల్ కపూర్‌ని ఆహ్వానించారు. సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టే ఉద్దేశం తనకు స్వతహాగా లేదని, తన కూతురు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నిర్మాతనయ్యానన్నారు. గతాన్ని తలచుకుంటూ... దర్శకుడు ఫిరోజ్ ఖాన్, తాను ఎలా స్నేహితులయ్యారో వివరించారు.
అలాగే 'గాంధీ మై ఫాదర్' ఎలా రూపుదిద్దుకుందో తెలిపారు. ఇలా గతాన్ని నెమరేసుకునే క్రమంలో ఆయన కళ్ళు చెమర్చాయి. కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకీ ఆయన్ని బాధించిన సంఘటన ఏదై ఉంటుందనుకుంటున్నారా? 'గాంధీ మై ఫాదర్' కథ ఆయన మనసును అమితంగా హత్తుకుందట| హృదయానికి దగ్గరగా ఉందట|
కొన్ని వారాల క్రితం మరో కన్నీటి ఎపిసోడ్ చోటుచోసుకుందట| ప్రముఖులు, మీడియా కోసం లండన్‌లో ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. సినిమా పూర్తి కాగానే అందరూ కళ్ళు తుడుచుకుంటూ బయట కొచ్చారని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాధ నిండిన హృదయంతో ఇంటికెళ్ళి గొప్ప చిత్రం చూశామన్న అనుభూతి పొందుతారని అనిల్ కపూర్ అంటున్నారు.