మోడ్రన్ టచ్ ఉన్న కథనంతో బాపు సినిమా
బాపు సినిమా అనగానే ఓ అందమైన అనుభూతికి లోనవుతారు ప్రేక్షకులు. చక్కని దృశ్యకావ్యంగా వుంటుంది. ఈసారి బాపు బొమ్మగా ఛార్మి నటిస్తుండగా ఆమెకు జోడీగా ఇ.వి.వి. నరేష్ నటిస్తున్నాడు. చైత్ర సినిమా సర్క్యూట్ బేనర్‌పై కె.అపర్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు 'ముత్యాలముగ్గు' విభిన్నకథగా ఎలా ఆకట్టుకుందో ఆ విధంగా మరో కొత్త సంవిధానంతో ఈ చిత్రం రూపొందుతోంది. మోడ్రన్‌టచ్ ఉన్న కథ. భావోద్వేగాలు, వినోదం, పొలిటికల్, ఫ్యామిలీటచ్ అన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని' చెప్పారు.
ఈ నెల 9 నుంచి 21 వరకు రామోజీ ఫిలింసిటీలో అధిక వ్యయంతో అధునాతనంగా తీర్చిదిద్దిన ఇంటి సెట్‌లో ఛార్మి, ప్రేమ, రంగనాథ్, సంగీత, వైజాగ్ ప్రసాద్, రాళ్ళపల్లి, సునీల్‌శర్మపై ఒక పాట, కొంత టాకీ చిత్రీకరించారు. ఈ నెల 29 నుంచి హైదరాబాద్, బొబ్బిలి, విజయనగరం, అరకు, రాజోలు తదితర ప్రాంతాల్లో నిరవధికంగా షూటింగ్ సాగుతోంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి పాటలు : వేటూరి, జొన్నవిత్తుల, సంగీతం : విద్యాసాగర్, ఛాయాగ్రహణం : పి.ఆర్.కె.రాజు అందుస్తున్నారు.