కటకటాల్లో ''ఖల్‌నాయక్''.. ఆందోళనలో నిర్మాతలు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు టాడా కోర్టు విధించింన ఆరేళ్ళ జైలు శిక్ష ప్రభావం బాలీవుడ్ చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సంజయ్‌ను నమ్ముకుని పెట్టుబడి పెట్టిన నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి పరిస్థితి ఏమవుతుందోనని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నాలుగు చిత్రాల నిర్మాణం ఆర్థాంతరంగా ఆగిపోయిన పక్షంలో సుమారు వంద కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్ల వచ్చని అంచనా. ఇదిలావుండగా సంజయ్‌దత్ బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఒక వేళ సుప్రీం బెయిల్ నిరాకరించిన పక్షంలో ఏమి చేయాలో 'ఖల్‌నాయక్' నిర్మాతలకు పాలుపోవడం లేదు.
అదేసమయంలో కటకటాల్లో జీవితం గడుపుతున్న సంజయ్‌దత్‌కు ప్రముఖ నిర్మాత మహేష్‌భట్‌తో పాటు.. బాలీవుడ్ చిత్రరంగం, భాజపా ఎంపీ శత్రుఘ్నసిన్హా, దర్శకుడు కునల్ కోహ్లి తదితరులు సంఘీభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంజయ్‌దత్ 'అలీబాగ్', 'కిడ్నాప్', 'మిస్టర్ ఫ్రాడ్', 'మున్నాభాయ్' సీక్వెల్ 'మున్నాభాయ్ చలే అమెరికా' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.