1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణలో శ్రీకాంత్-వేణుల ''యమగోల''

శ్రీకాంత్
WD PhotoWD
శ్రీకాంత్, వేణు, మీరాజాస్మిన్, రీమాసేన్ ప్రధాన తారాగణంగా ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'యమగోల' (మళ్లీ మొదలైంది). ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని చివరి పాటను నాలుగు రోజుల పాటు.. బ్యాంకాగ్‌లో చిత్రీకరించారు. మరోవైపు చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.

భాస్కరభట్ల అందించిన చక్కటి సాహిత్యానికి, జీవన్‌థామస్ అద్భుతమైన బాణీలను సమకూర్చారని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలోయముడిగా కైకాల నటిస్తుండగా.. మిగిలిన పాత్రల్లో బాలయ్య, నరేష్, చలపతి రావు, కృష్ణభగవాన్, ఏవీఎస్, ఎల్బీ.శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, శివాజీరావు, కవిత, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు.. సత్యానంద్, దాసరి బ్రహ్మం, కెమరా.. స్టడీకామ్ ప్రసాద్, ఎడిటింగ్.. నాగిరెడ్డి, నిర్మాతలు.. అమర్, రాజశేఖర్, సతీష్, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. శ్రీనివాస రెడ్డి.
About Writer
PNR