1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాపు బొమ్మ ప్రేక్షకులను ఆకట్టుకునేనా..?

నాడు 'ముత్యాలముగ్గు'. మొన్న 'మిస్టర్ పెళ్లాం'. నిన్నటి 'రాధాగోపాళం'. ఇవన్నీ ప్రముఖ దర్శకుడు బాపు సినిమాలు. సంగీత
WD PhotoWD
నాడు 'ముత్యాలముగ్గు'. మొన్న 'మిస్టర్ పెళ్లాం'. నిన్నటి 'రాధాగోపాళం'. ఇవన్నీ ప్రముఖ దర్శకుడు బాపు సినిమాలు. సంగీత, ఆమని, దివ్యవాణి వంటి హీరోయిన్లు ఆయన దర్శకత్వంలో నటించి తరించిపోయారు. నేడు అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న హీరోయిన్ బ్యూటీక్వీన్ ఛార్మీ.

తెలుగు వెండితెరపై గ్లామర్‌కు ప్రత్యేక నిర్వచనం చెప్పి, నిజమైన సినీ తారకు ఉండాల్సిన తళుకుబెళుకులు వెండితెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మంత్రముగ్ధ ఛార్మి. తాజాగా గోల్డెన్ అవకాశాన్ని కొట్టేసిన ఛార్మి.. బాపు చిత్రంలో ఎలాంటి నటన ప్రదర్శించనుందో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఎందరో నటీమణుల అందాను వెండితరపై ప్రత్యేక బాణీలో ఆవిష్కరించిన బాపు.. ఛార్మిని ఎలాంటి బొమ్మగా తీర్చిదిద్దనున్నారో వేచి చూడాల్సిందే.
About Writer
PNR