కథలో సత్తా ఉంటేనే.. స్టార్ హీరోలకు ఛాన్స్: భారతీరాజా
కథలో ఉన్న డిమాండ్ మేరకే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తానని, లేదంటో.. యువనటీనటీలకే తన చిత్రాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా అన్నారు. అర్జున్, కాజల్, నానాపటేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కాళిదాస్' చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఆడియోను ఆవిష్కరించి తొలి క్యాసెట్‌ను చిత్ర దర్శకుడు భారతీరాజాకు అందజేశారు.
ఈసందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ.. నేనెప్పుడూ కొత్తవారితో సినిమాలు తీస్తాను. అయితే.. ఈ 'కాళిదాస్' చిత్రాన్ని మాత్రం స్టార్ హీరోలతో నిర్మిస్తున్నాను. దీనికి ప్రధాన కారణం కథాబలమే. చిత్రంలోని పాయింట్ విశ్వవ్యాప్తమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
తన చిత్రం 'పదహారేళ్ళ వయస్సు' సినిమా ఎంత ఎనర్జటిక్‌గా తీశానో.. అదే స్థాయిలో 'కాళిదాస్' చిత్రాన్ని తీశాను. హిందీ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా అందించిన సంగీతం అద్భుతంగా ఉందన్నారు. నిర్మాత లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రాన్ని ఈనెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. సురేష్.