''సంధ్య'' చిత్రం ఆడియో విడుదల
బాలాదిత్య, గాయత్రి జంటగా నటిస్తున్న చిత్రం 'సంధ్య'. గణమురళి దర్శకత్వంలో పి.భైరవయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల హైదరాబాద్‌లో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శోభరాజ్ చిత్రం ఆడియోను విడుదల చేసి ఎంవి.లక్ష్మికి అందచేశారు. ఈ సందర్భంగా శోభరాజ్ మాట్లాడుతూ.. మహిళాభ్యుదయాన్నే ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రానికి గణేశ్ చక్రవర్తి అందించిన చక్కటి సంగీత బాణీలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. గణేష్ చక్రవర్తి చిన్నతనం నుంచి నాకు బాగా తెలుసు. ఆయనలో ప్రతిభ ఉంది. అన్ని రకాల సంగీతాన్ని సమకూర్చే తెలివితేటలు ఉన్నాయి. కొత్త దర్శకుడి ఆడియో ప్రముఖ సంస్థ నుంచి విడుదలైతే మంచి పేరు వస్తుంది. గణేష్‌కు అలాంటి అవకాశమై లభించింది.
హీరో బాలాదిత్య మాట్లాడుతూ ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు. అందులో గణేష్ చక్రవర్తి కూడా ఒకరు. అలాగే గాయత్రి కూడా ఓ హీరోయిన్ కింద లెక్కే. ఈ చిత్రం కథ ఆమె చుట్టూ తిరుగుతుంది. కీరవాణి వద్ద పనిచేసిన గణేష్.. ఆయన పేరును నిలబెడతారన్నారు ఈ కార్యక్రమంలో రాజమౌళి, కెవి.లక్ష్మి, సావిత్రి, రత్నకుమారి, బాబూమోహన్ తదితరులు పాల్గొన్నారు.