1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో నటి టబు

'ఇన్‌స్కృటబుల్ అమెరికన్' చిత్రంలో దర్శకుడిగా మారిన చంద్ర సిద్ధార్థ 'ఆ నలుగురు' చిత్రం విజయంతో ఆందరి ప్రశంసలు
WD PhotoWD
'ఇన్‌స్కృటబుల్ అమెరికన్' చిత్రంలో దర్శకుడిగా మారిన చంద్ర సిద్ధార్థ 'ఆ నలుగురు' చిత్రం విజయంతో ఆందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆయన నిర్మించిన 'మధుమాసం' చిత్రం మంచి సక్సెస్‌ సాధించింది. ఈ నేపథ్యంలో నటి టబుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధార్థ సన్నాహాలు చేస్తున్నారు. 'అందరివాడు' చిత్రంలో మెగాస్టార్ సరసన నటించిన టబు.. చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు వెండి తెరపై కనిపించనున్నారు.

చంద్ర సిద్ధార్థ చెప్పిన కథ నచ్చడంతో తాజా చిత్రంలో నటించేందుకు టబు నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సున్నితమైన భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు, హాస్యంతో ముడిపడిన కథతో రూపొందున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే సెప్టెంబరు నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్ర హీరోను ఎంపిక చేయాల్సి ఉండగా మరో యువ కథానాయకుడు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నారు. ఆ నలుగురు చిత్రానికి గాను చంద్ర సిద్ధార్థకు అవార్డు కూడా వచ్చిన విషయం తెల్సిందే.
About Writer
PNR