1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఫిరోజ్‌ ఖాన్ ఖుర్బాని రిమేక్ చిత్రంలో మల్లిక

అలనాటి సీనియర్ నటుడు ఫిరోజ్ ఖాన్ తాజాగా నిర్మిస్తున్న 'ఖుర్బాని' రిమేక్ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్‌ను
WD PhotoWD
అలనాటి సీనియర్ నటుడు ఫిరోజ్ ఖాన్ తాజాగా నిర్మిస్తున్న 'ఖుర్బాని' రిమేక్ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్‌ను హీరోయిన్‌గా ఎన్నికైనట్టు వినికిడి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రిమేక్‌ల పర్వం జోరుగా నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రీమేక్ చేసిన 'దేవదాస్', 'డాన్' చిత్రాలు మంచి సక్సెస్‌ను సాధించడంతో బాలీవుడ్ ప్రముఖులు రిమేక్‌లపై దృష్టిసారించారు.

ఈ నేపథ్యంలో 1980లో ఫిరోజ్ ఖాన్ హీరోగా నటించి, సూపర్ డూపర్ హిట్ అయిన 'ఖుర్బాని' చిత్రాన్ని.. ఆ చిత్ర హీరోనే స్వయంగా మళ్లీ రిమేక్ చేయనున్నారు. ఇందులో హీరోలుగా ఫర్థీన్ ఖాన్, సైఫ్ ఆలీఖాన్‌లు నటించనున్నారు. గతంలో ఫిరోజ్ ఖాన్ పోషించిన హీరో పాత్రను ఫర్థీన్ ఖాన్, వినోద్ ఖన్నా పాత్రను సైఫ్ ఆలీఖాన్‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో కీలకమైన పోలీసు ఆఫీసర్ అమ్జాద్ ఖాన్ పాత్రను స్వయంగా ఫిరోజ్‌ ఖాన్ పోషించనున్నారు. అతిత్వరలో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రంలో నాటి హీరోయిన్ జీనత్ అమన్ పోషించిన పాత్రను సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ పోషించనుంది.
About Writer
PNR